Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బాలానగర్
ఇంటి ముందు కూర్చున్న ఓ వృద్ధురాలు అదృశ్య మైంది. ఈ ఘటన బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిది óలో ఆదివారం చోటు చేసుకుంది. సీఐ వహీదుద్దీన్ వివరాల ప్రకారం బాలానగర్ డివిజన్ పరిధిలోని చెరబండరాజు కాలనీలో నివాసముంటున్న కన్నేమైన లక్ష్మి (60) కి పక్షవాతం ఉంది. శనివారం కూతురు స్నానం చేయించిన అనంతరం ఆమెను ఇంటి ముందు ఎండలో కూర్చో బెట్టింది. కాసేపటి తర్వాత ఆమె కనిపించకుండా పోయింది. అనంతరం ఫిర్యాదుదారులు బంధువులను విచారించి, పరిసర ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభించలేదు. ఈ మేరకు కుటుంబ సభ్యులు ఆదివారం బాలానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్నారు.