Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుండిగల్
ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకోవాలనీ, ఇలాంటి వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహించిన లావ్రెన్స్, మాయో, వైద్యులను అభినందించాలని నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ 27వ డివిజన్ కార్పొరేటర్ జ్యోతిరెడ్డి తెలిపారు. ఆదివారం నిజాంపేటలోని బండారి లేఔట్ కమ్యూనిటీ హాల్లో లావ్రేన్స్, మాయో వైద్య బృందం ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. డివిజన్ పరిధిలోని అనేక మంది ప్రజలు ఉచిత కంటి పరీక్షలు సద్వినియోగ పరచుకున్నారనీ, ఈ కార్యక్రమానికి సహకరించిన వైద్య బృందం చేసిన సేవలకు, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంక్షేమ సంఘం నాయకులు నరసింహారెడ్డి, స్థానిక ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.