Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాప్రా
కామ్రేడ్ ఎన్వీ భాస్కర్‌రావు 37వ వర్ధంతిని ఈసీఐఎల్‌లోని సీపీఐ(ఎం) జిల్లా కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా సీనియర్ నాయకులు యాదగిరిరావు భాస్కరరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్లర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భాస్కర్‌రావు త్యాగం మరువలేనిదన్నారు. ఆయన పార్టీ మరింతగా బలపడటం కోసం ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. పార్టీ సభ్యులందరూ భాస్కర్ రావు త్యాగాలను ఆదర్శంగా తీసుకుని మరిన్ని పోరాటాలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మేడ్చల్ జిల్లా నాయకులు పీబీ చారి, సాంబశివరావు, వెంకటేష్, శంకర్, చంద్రకాంత్, సాయి, కార్తీక్, తదితరులు పాల్గొన్నారు.
బాలానగర్ : బాలానగర్‌లోని శ్రీ శ్రీ నగర్‌లోగల భాస్కరరావు భవన్లో కామ్రేడ్ ఎన్.వి భాస్కర్‌రావు 37వ వర్ధంతి సందర్భంగా ఆదివారం బాలానగర్‌లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మండల కార్యదర్శి ఐలాపురం రాజశేఖర్, సీనియర్ నాయకుడు టి.మోహనరావు మాట్లాడుతూ సీఐటీయూ కార్మిక సంఘంలో కార్మికుల సమస్యలపై అనునిత్యం పోరాటాలు చేసి ఐడీపీఎల్, ఆల్విన్, హెచ్ఎంటీ, బీహెచ్ఈఎల్ వంటి ప్రభుత్వ రంగ సంస్థల్లో కార్మిక నాయకులను తయారు చేసిన నాయకుడు అనీ, కార్మిక సమస్యపై అనునిత్యం అనేక పోరాటాలు నిర్వహించారనీ, ఓపక్క న్యాయవాదిగా కొనసాగుతూ కార్మిక పక్షాన కేసులు వాదించే వ్యక్తి అనీ, సీపీఐ(ఎం) హైదరాబాద్ కమిటీ మొదటి కార్యదర్శిగా పని చేశారని తెలిపారు. హైదరాబాద్ నగరంలో సీఐటీయూ కార్మిక సంఘం, సీపీఐ(ఎం) కార్యకర్తలను సైద్ధాంతికంగా తయారు చేసి పార్టీ కార్యకర్తలుగా తయారు చేశారని తెలిపారు. తన కుటుంబంలో వారి పిల్లలకు కులాంతర వివాహాలు, పార్టీ వివాహాలు చేసి ఆదర్శంగా ఉన్న వ్యక్తి కామ్రేడ్ ఎన్ వి భాస్కరరావు అనీ, ఆయన కోరుకున్న ఆశయ సాధన మనం కృషి చేయడమే నిజమైన నివాళి అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకుడు వైవి.రావు, మండల నాయకులు కృష్ణానాయక్, జగన్, లక్ష్మీ, యాదగిరి, నరేష్, రాజు, తదితరులు పాల్గొన్నారు.