Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పరికరాన్ని ఆవిష్కరించిన కేంద్ర పర్యాటకశాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి
నవతెలంగాణ-హైదరాబాద్
హైదరాబాద్ ఆధారిత జైత్ర డివైజెస్ అండ్ సిస్టమ్స్ ఎల్ఎల్పీ తన కొత్త డివైస్ బైపోలార్ గాలి క్రిమిసంహారిణి అండ్ ప్యూరిఫైయర్‌ను దేశంలో ప్రారంభించినట్టు ప్రకటించింది. ఈ పరికరాన్ని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, భారతదేశ ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రి జి.కిషన్‌రెడ్డి ఆవిష్కరించారు. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమానికి కిషన్‌రెడ్డి ముఖ్య అథితిగా హాజరు కాగా, ట్రివిట్రాస్ హెల్త్‌కేర్ గ్రూప్ చైర్మెన్ డాక్టర్ జిఎస్కే. వేలు, మాక్సివిజన్ గ్రూప్ ఆఫ్ ఐ హాస్పిటల్స్ అండ్ ఎస్టోనియా గౌరవ కాన్సుల్ డాక్టర్ బొల్లినేని భాస్కర్‌రావు, కిమ్స్ హాస్పిటల్ వ్యవస్థాపకుడు అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గౌరవ అథితులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కాసు ప్రసాద్‌రెడ్డి, జైత్ర డివైజెస్ అండ్ సిస్టమ్స్ ఎల్ఎల్పీ కో-చైర్మెన్ అండ్ మాక్సివిజన్ ఐ హాస్పిటల్స్ గ్రూప్ వ్యవస్థాపకుడు అండ్ కో-చైర్మెన్ మాట్లాడుతూ జైత్ర డివైజెస్ అండ్ సిస్టమ్స్ ఎల్ఎల్పీ బైపోలార్ ఎయిర్ క్రిమిసంహారక అండ్ ప్యూరిఫైయర్ గాలి క్రిమిసంహారక పరికరంగా సమర్ధవంతంగా నిరూపించబడిందని తెలిపారు. బైపోలార్ అయోనైజేషన్ టెక్నాలజీని అవలంభించిన మొట్టమొదటి మేక్ ఇన్ ఇండియా ఉత్పత్తి ఇది అని తెలిపారు. వైరస్లు, బ్యాక్టీరియా కణ త్వచ ఉపరితలంపై రసాయన ప్రతి చర్యను ప్రారంభించడం ద్వారా హానికరమైన సూక్ష్మజీవులకు వ్యతిరేఖంగా పని చేస్తుందని పేర్కొన్నారు. భారతీయ వినియోగదారులకు అత్యంత విశ్వసనీయమైన సేవలను అందించడమే తమ లక్ష్యమనీ, ఇది వ్యాధుల నుంచి కాపాడటమే కాకుండా వారి జీవన నాణ్యతను మెరుగుపరుస్తుందని తెలిపారు.