Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కంటోన్మెంట్లో మినీ మారదన్ కార్యక్రమాలు
- 5కె రన్లో పాల్గొన్న విద్యార్థులు, క్రీడాకారులు
నవతెలంగాణ-కంటోన్మెంట్
కేంద్ర రక్షణశాఖ పరిధిలోని కంటోన్మెంట్లో ఆజాది క అమత్ మహొత్సవ్ను పురస్కరించుకుని కంటోన్మెంట్ బోర్డు యంత్రాంగం మినీ మారదన్ కార్యక్రమాలు నిర్వహించారు. ఆదివారం ఉదయం మడ్ ఫోడ్లో హాకీ స్టేడియంలో బోర్డు సీఈఓ అజిత్‌రెడ్డి అధ్యక్షతన రన్ ఫర్ యూనిటీ కంట్రీ పేరుతో 5కె రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, ఎమ్మెల్యే జి.సాయన్న, మేజర్ జనరల్ ప్రీత్ పాల్ సింగ్, బోర్డు అధ్యక్షుడు అభిజిత్ సింగ్, నార్త్ జోన్ డీసీపీ కల్మేష్, బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్, భానుకి నర్మద, మాజీ సభ్యులు పాండు యాదవ్, లోకనాధం, ప్రభాకర్, టీఆర్ఎస్, బీజేపీ సీనియర్ నాయకులు, అంతర్జాతీయ, జాతీయ క్రీడాకారులు, జంట నగరాల నుంచే కాకుండా శివారు ప్రాంతాల ఇంజినీరింగ్ కళాశాలు, జూనియర్ కళాశాలు, ఉన్నత పాఠశాలలో నుంచి వేలాదిమంది విద్యార్థులు ఈ రన్లో పాల్గొన్నారు. కంటోన్మెంట్ క్రీడాకారులు కూడా పాల్గొన్నారు. ఈ కార్యమ్రంలో భాగంగా మంత్రి మల్లారెడ్డి గాలిలో తుపాకీ పేల్చగా, మేజర్ జనరల్ ప్రీత్‌సింగ్ జెండా ఊపి ప్రారంభించారు. భారత్ మాతాకీ జై అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ రన్ 5 కిలోమీటర్ల దూరం మడ్ ఫోడ్ నుంచి, ప్యారడైజ్ చౌరస్తా, తాడ్ బండ్ చౌరస్తా, సెంటర్ పాయింట్ చౌరస్తా, డైమండ్ పాయింట్ గుండా కొనసాగింది. భారీ పోలీస్ బందోబస్తు మధ్య ఈ మినీ మారథాన్ రన్ కార్యక్రమాలు జరిగాయి.