Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్చరల్
లఘు చిత్రాలు రూపకల్పనలో తెలంగాణ యువత ఆసక్తి కన పరుస్తోందని రాష్ట్ర భాషా సాంస్కతిక శాఖ సంచాలకులు మామిడి హరికష్ణ అన్నారు. రవీంద్రభారతిలోని పైడి జయరాజ్ మినీ థియేటర్లో కలరాజ్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ ప్రయివేట్ లిమిటెడ్ నిర్వహణలో సాంస్కతిక శాఖ సౌజన్యంతో నాలుగవ తెలుగు లఘు చిత్ర అవార్డ్లకు దరఖాస్తులను ఆహ్వానిస్తూ బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. గత మూడు పోటీలలో నాణ్యమైన సజనాత్మక లఘు చిత్రాలు పోటీలకు వచ్చాయన్నారు. సంస్థ నిర్వాహకులు శ్రీనివాస్ పోటీలలకు నవంబర్ 21 లోగా ఎంట్రీలు/ నామినేషన్లు పంపవచ్చని తెలిపారు వివరాలకు 7036201234లో సంప్రదించాలన్నారు. వేదిక పై ప్రవీణ్, పారుపల్లి రవి, ఇ. శ్రీనివాస్, గుప్తా, రోహిత్ తదితరులు పాల్గొన్నారు.