Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కూకట్పల్లి
గుజరాత్‌లోని నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ (ఎన్ఎఫ్ఎస్యూ)లో ఎం.టెక్(సైబర్ సెక్యూరిటీస్) ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుకు, దేశవ్యాప్తంగా నిర్వహించిన అర్హత పరీక్షలో అత్యధిక మార్కులు సాధించి, ఎస్సీ ఎస్టీ గురుకుల సొసైటీలకు చెందిన14 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. ఇందులో కూకట్పల్లి జిల్లా పరిషత్ హైస్కూల్‌కు చెందిన పూర్వ విద్యార్థి చింతకుంట్ల భాను ప్రసాద్ ఆల్ ఇండియా ఎస్సీ క్యాటగిరీలో 11వ ర్యాంకు సాధించి ఎన్ఎఫ్ఎస్యూలో సీటు సంపాదించడం ఎంపిక కావడం పట్ల పాఠశాల పధానోపాధ్యాయులు నరేందర్ రెడ్డి, గణిత ఉపాధ్యాయులు నర్సింహులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. భానుప్రసాద్ తల్లిదండ్రులు శ్రీను, రమణమ్మ బతుకు తెరువు కోసం 20 ఏండ్ల కిందట నాగర్ కర్నూల్ జిల్లా వంగూర్ గ్రామం నుంచి హైదరాబాద్ వచ్చి కూకట్ పల్లిలో ఉంటూ రోజువారి కూలి పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు.