Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ధూల్‌పేట్
ఓల్డ్‌సిటీ సమస్యలపై నిరంతరం పోరాటం చేసి, అనేక మురికివాడల్లో కనీస వసతుల కల్పన కోసం కృషి చేసిన వ్యక్తి ఎస్.పాండురంగా రావు సేవలు మరువలేనివని పీసీసీ మాజీ అధ్యక్షులు, మాజీ ఎంపీ వి.హనుమంత రావు అన్నారు. ఆదివారం ఫలక్నామా సమీపంలోని రెయిన్బో అనాథ బాలిక వసతిగృహంలో ఏర్పాటు చేసిన పాండు రంగారావు వర్ధంతి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. నిరంతరం పేద ప్రజల సమస్యలపై పోరాటం చేసి ప్రజా నాయకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాయని కొనియాడారు. అనంతరం యువజన కాంగ్రెస్ నాయకుడు ఎస్.పి.క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో విద్యార్థులకు దుప్పట్లు, నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అఫ్సర్ యూసఫ్, బి.కార్తీక్ చారి, బి.నరేష్, బి.మధు, ఆర్.శివకుమార్, జి.నవీన్ కుమార్, ఎస్.నగేష్, నరసింహ, బి.వినీత్ కుమార్ పాల్గొన్నారు.