Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు సుదర్శన్ బాబు
నవతెలంగాణ-అడిక్మెట్
బహుజనులంతా ఏకమై సమూహ శక్తిగా ఏర్పడాలని తెలంగాణ షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు సుదర్శన్ బాబు పిలుపునిచ్చారు. ఆదివారం కవాడిగూడ అంబేద్కర్ భవన్లో షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో బహుజనుల అలరు-బలరు కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, సాయన్న, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సుధాకర్, రాగల నాగేశ్వరరావు, రుద్రారం శంకర్ హాజరయ్యారు. అనంతరం సుదర్శన్ బాబు మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి 75 ఏండ్లు గడిచినా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల జీవితాల్లో మార్పులు రాకపోవడానికి కారణం పాలకులకు చిత్తశుద్ధి లేకపోవడమే అన్నారు. ప్రజలు పాలకులపై ఆధారపడకుండా స్వయంశక్తితో పైకి రావాలన పిలుపునిచ్చారు. ఎస్సీ, ఎసీ,్ట బీసీ మైనార్టీలు ఐకమత్యంగా నడిచిరావాలని కోరారు. కార్యక్రమంలో ఎస్ కొమరయ్య, వినరు బాబు, కృష్ణవేణి, మహేందర్, రవీందర్, శంకర్, దశరథ్, శివ, శంకర్, రపక అశోక్, దుర్గా, కర్ణాకర్, బాలమణి, రాధిక తదితరులు పాల్గొన్నారు.