Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జూబ్లీహిల్స్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులు, పేదలకు వ్యతిరేకంగా అనుసరిస్తున్న విధానాలపై పోరాటం చేయాల్సిన బాధ్యత ఉందని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం శ్రీనివాస్ రావు అన్నారు. ఆదివారం జూబ్లీహిల్స్ జోన్ సీపీఐ(ఎం) కమిటీ ఎన్నిక నిర్వహించి నూతన కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఏర్పాటుకు వారు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. స్థానిక సమస్యలపై పోరాటం చేసి అధికారులను, నాయకులను నిలదీసి ప్రజల పక్షాన పోరాటం చేయాలని సూచించారు. జూబ్లీహిల్స్ జోన్ కమిటీ కన్వీనర్‌గా రాపర్తి అశోక్, కమిటీ సభ్యులుగా చంద్రశేఖర రావు, సాయి శేషగిరిరావు, స్వామి నియామకమయ్యారు.