Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హిమాయత్‌నగర్
దళిత విద్యార్థిని ప్రేమ పేరుతో వేధించి కిడ్నాప్ చేసి లైంగికదాడి, హత్య చేసిన సాజిత్ గ్యాంగ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి కృష్ణ స్వరూప్ డిమాండ్ చేశారు. ఈమేరకు ఆదివారం హిమాయత్‌నగర్, లిబర్టీలోని డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం కృష్ణ స్వరూప్ మాట్లాడుతూ మహిళలు, మైనర్ బాలికలపై కిడ్నాప్, లైంగికదాడులు, హత్యలు జరుగుతుంటే నిందితులను శిక్షించకుండా దళితుల పట్ల ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కుల వివక్షత చూపుతుందని ఆరోపించారు. ఈఘటనలో ఒక్క సాజిత్ కాకుండా మిగతా గ్యాంగ్ హస్తం ఉందని, దీనిపై సిట్ దర్యాప్తు కమిటీ నియమించాలని డీజీపీని కోరారు. బాధిత కుటుంబాన్ని సీఎం కేసీఆర్ ఆదుకోవాలని కోరారు. ఈనిరసన కార్యక్రమంలో పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు వేదవృత్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చేపూరి రాజు, ఓయూ విద్యార్ధి నేత, దళిత బహుజన స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర కోఆర్డినేటర్ ఇటిక్యాల గణేష్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.