Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీసీ సంఘర్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు కోనూరు నరసింహ గౌడ్
నవతెలంగాణ-అడిక్‌మెట్
హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ పిరికిపందా, ప్రగతిభవన్ బానిస అని కించపరిచిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి యావత్ బీసీ జాతికి క్షమాపణలు చెప్పాలని తెలంగాణ బీసీ సంఘర్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు కోనూరు నరసింహ గౌడ్ డిమాండ్ చేశారు. ఈమేరకు ఆదివారం పత్రిక ప్రకటన ద్వారా స్పందించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలు తెలంగాణ యాదవ జాతిని కించపరిచే విధంగా ఉన్నాయన్నారు. యాదవ బీసీ జాతికి క్షమాపణలు చెప్పాలని, లేనిపక్షంలో హుజూరాబాద్‌లో బీజేపీ అభ్యర్థిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం అని హెచ్చరించారు. బీసీలను కించపరచడం అగ్రకుల దురహంకారానికి పరాకాష్ట అని దుయ్యబట్టారు. యాదవ కులానికి చెందిన గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను భారీ మెజార్టీతో గెలిపిస్తారని పేర్కొన్నారు.