Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) అంబర్‌పేట కార్యదర్శి
ఎం. మహేందర్
నవతెలంగాణ-అంబర్ పేట
చెంచుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిన్నచూపు చూస్తున్నాయని సీపీఐ(ఎం) అంబర్‌పేట కార్యదర్శి ఎం. మహేందర్ అన్నారు. ఆదివారం బతుకమ్మ కుంటలో చెంచు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన కమ్యూనిటీ హాల్‌ను ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ చెంచుల సంక్షేమాన్ని వారి హక్కులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని, వారికి మౌలిక సదుపాయాలు కల్పించడంలో విఫలమయ్యాయని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు వారిని ఆదుకోవడానికి బడ్జెట్లో ప్రత్యేక నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం)నగర మహిళా నాయకురాలు వరలక్ష్మి, బస్తీ నాయకులు మైసయ్య, బాలకృష్ణ, ఎక్కయ్య, హనుమంత్, మహేష్, చిన్నయ్య, నాగులు, కురుమయ్య, కృష్ణ, నరసింహ్మ, వెంకటేష్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.