Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 350 పీహెచ్ పట్టాలు, 80 గోల్డ్ మెడల్స్ ప్రదానం
నేటి మధ్యాహ్నం నుంచి పాస్‌ల జారీ
నవతెలంగాణ-ఓయూ
ఉస్మానియా విశ్వవిద్యాలయం 81వ స్నాతకోత్సవం ఈనెల 27న ఓయూ ఠాగూర్ ఆడిటోరియంలో నిర్వహించనున్నారు. రాష్ట్ర గవర్నర్ తమిళిసైతో పాటు డీఆర్డీఓ చైర్మెన్ డా.జి.సతీష్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై స్నాతకోత్సవ ఉపన్యాసం ఇవ్వనున్నారు. ఈకార్యక్రమ నిర్వహణ కోసం కంట్రోలర్ ప్రొ.శ్రీరాం వెంకటేష్, అడిషనల్ కంట్రోలర్స్ ఆధ్వర్యంలో ఇప్పటికే ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం ఓయూ డీన్స్‌కు వీసీ ప్రొ.రవీందర్, రిజిస్ట్రార్ ప్రొ.లక్ష్మీనారాయణ మాక్ డ్రిల్ ఏర్పాటు చేశారు. ఈస్నాతకోత్సవంలో భాగంగా 350 మంది పీహెచ్డీ పట్టాలు, 80 మంది గోల్డ్ మెడల్స్‌ను స్వీకరించనున్నారు. పీహెచ్డీ పట్టాల కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు ఈనెల 25 మధ్యాహ్నం నుంచి పాస్‌లు, ఇన్విటేషన్ కార్డ్స్ స్వీకరించాలని కంట్రోలర్ ప్రొ.శ్రీరాం వెంకటేష్ సూచించారు. ఇన్విటేషన్ కార్డ్‌పై యూనిక్ నెంబర్ ఇచ్చామని, తీసుకున్న వ్యక్తికి తప్ప ఇతరులకు అది చెల్లదన్నారు. పీహెచ్డీ, గోల్డ్ మెడల్స్ అభ్యర్థులు కారు, ఇతర వాహనాలను టెక్నాలజీ కళాశాలలో, ఓయూ ఫ్యాకల్టీ అధికారులు సైన్సు కళాశాలలో, వీఐపీలు ఠాగూర్ ఆడిటోరియంలో వద్ద, గోల్డ్ మెడల్స్ డోనర్స్ కోసం జియో ఫిజిక్స్ వద్ద పార్కింగ్ ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు.