Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హిమాయత్‌నగర్
జాతీయ బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కారుకొండ నటరాజ్ నియమితులయ్యారు. ఈమేరకు సోమవారం సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. అనంతరం కృష్ణయ్య మాట్లాడుతూ బీసీల రాజ్యాధికారమే లక్ష్యంగా నేటి యువతరం కృషి చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం జనగణనలో బీసీ కులాలను లెక్కించాలని డిమాండ్ చేశారు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు కె.మాణిక్ రావ్ శాస్త్రి మనవడు కె.నటరాజ్ ఉన్నత విద్యావంతుడని, ప్రస్తుతం న్యాయవాదిగా పని చేస్తున్నారని చెప్పారు. నటరాజ్ మాట్లాడుతూ బీసీ సంఘం పటిష్టత కోసం రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తానని, బీసీల రాజ్యాధికార సాధన కోసం తన వంతు కృషి చేస్తానని చెప్పారు. కార్యక్రమంలో బీసీ నాయకులు నీల వెంకటేష్, జిల్లపల్లి అంజి, జి కృష్ణ యాదవ్, చంటి ముదిరాజ్ పాల్గొన్నారు.