Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బోడుప్పల్
విద్యార్థులకు ఇప్పటి నుంచే ఎన్నికలు, పాలకవర్గం, రాజకీయ అంశాలపై అవగాహన కల్పించేందుకుగాను హైస్కూల్ విద్యార్థులకు ఎన్నికలు నిర్వహించామని బోడుప్పల్ నారాయణ పాఠశాల ఏజీఎం శ్రీనివాసరావు పేర్కొన్నారు. సోమవారం పాఠశాల క్యాబినేట్ ప్రమాణ స్వీకారం సందర్భంగా అయన మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులు అనే ఉద్దేశంతో భావి భారత పౌరులకు పార్లమెంటరీ వ్యవస్థపై అవగాహన కల్పించేందుకు వీలుగా హైస్కూల్ స్థాయి విద్యార్థులకు ఎన్నికలు నిర్వహించి గెలుపొందిన వారికి క్యాబినేట్ పదవులు అప్పగించామని తెలిపారు. బాధ్యత కలిగిన వారు స్కూల్ నిర్వహణలో ఎలా ఉండాలో సూచనలు ఇచ్చామని చెప్పారు. కార్యక్రమంలో నారాయణ అర్ఐ గవ్వల రవి ప్రసాద్, ప్రిన్సిపాల్ సత్యవాణి, సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ దాక్షాయణి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.