Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రొఫెసర్ కోదండరాం
నవతెలంగాణ-అంబర్‌పేట
విద్యార్థుల సమస్యలపై నిరంతరం పోరాడాలని టీజేఎస్ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. విద్యార్థి జన సమితి హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి మాసంపల్లి అరుణ్ కుమార్ అధ్యక్షతన జిల్లా ముఖ్య నాయకుల సమావేశం సోమవారం పార్టీ ఆఫీస్‌లో జరిగింది. ఈసమావేశానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షులు ప్రొ. కోదండరాం హాజరై హైదరాబాద్ జిల్లా విద్యార్థి విభాగం నూతన అధ్యక్షుడిగా నకిరేకంటి నరేందర్‌ను నియమించారు. ఈసందర్భంగా విద్యార్థి జనసమితి రాష్ట్ర అధ్యక్షుడు బాబుమహాజన్ మాట్లాడుతూ డిసెంబరు 3న హైదరాబాద్‌లో జరిగే యూత్ డిమాండ్స్ డేకు రంగారెడ్డి జిల్లా నుంచి భారీగా యువత, నిరుద్యోగులు తరలిరావాలని పిలుపునిచ్చారు. అనంతరం హైదరాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా బాలెంల జీవన్, ఉపాధ్యక్షులుగా డప్పు గోపి, ఆర్గనైజింగ్ సెక్రెటరీగా పాంచాల శ్రీను, కార్యదర్శిగా ఈదుల సాయి ప్రశాంత్ , సురారం నవీన్ లను నియమించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు పేరాల ప్రశాంత్, టీజేఎస్ హైదరాబాద్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.