Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లోక్‌దళ్ పార్టీ జాతీయ కార్యదర్శి, రాష్ట్ర అధ్యక్షులు పుల్లూరి వెంకట రాజేశ్వరరావు
నవతెలంగాణ-హిమాయత్‌నగర్
హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు ప్రజలు ఎందుకు ఓటు వేయాలని లోక్‌దళ్ పార్టీ జాతీయ కార్యదర్శి, రాష్ట్ర అధ్యక్షులు పుల్లూరి వెంకట రాజేశ్వరరావు సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ప్రశ్నించారు. సంపన్నులకు రాయితీలు, సామాన్యులకు పన్నుల భారం, పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్, నిత్యావసర సరుకులు, చివరికి అగ్గిపెట్టె ధరలను పెంచుతున్నందుకు బీజేపీకి ఓటు వేయాలా అని విమర్శించారు. కేంద్రం విభజన హామీలు, జల వివాదాలు, అసెంబ్లీ సీట్ల పెంపు, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ హామీలు మరిచిందని గుర్తుచేశారు. 2014 నుంచి అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నేడు హుజురాబాద్ ఎన్నికల లబ్ధి పొందడం కోసం ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పడం శోచనీయమన్నారు. ఆత్మాభిమానం చంపుకుని రాజీనామా చేశానని చెప్పుకునే ఈటలకు భవిష్యత్‌ను సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ ఇచ్చిందన్నారు. అలాంటి వారిని వెన్నుపోటు పొడిచి ప్రభుత్వంకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపీని ఓడించాలని ఓటర్లకు ఆయన సూచించారు.