Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
ఉస్మానియా విశ్వవిద్యాలయం మెకానికల్ ఇంజినీరింగ్ విభాగం, త్రీడీ ప్రింటింగ్ సెంటర్ (సీపీడీడీఎం) సంయుక్త ఆధ్వర్యంలో ఏఐసీటీఈ వారి సహకారంతో 'ప్రోగ్రామ్ ఆన్ త్రీడీ ప్రింటింగ్ అండ్ డిజైన్' అనే అంశంపై వారం రోజుల ఆన్లైన్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈశిక్షణా కార్యక్రమాన్ని ఓయూ రిజిస్ట్రార్ ప్రొ. పప్పుల.లక్ష్మీనారాయణ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. బెంగుళూర్ విస్రో త్రీడీ ప్రింటింగ్ ప్రోగ్రామ్ డైరెక్టర్ డా.యూ.చంద్రశేఖర్ నేటి సమాజంలో జరుగుతున్న మార్పులకు అనుగుణంగా టెక్నాలజీ సహాయంతో త్రీడీ ప్రింటింగ్లో ఉన్న లాభాలు వివరించారు. వారంరోజులుపాటు 165 మందికి శిక్షణ ఇవ్వనున్నట్లు కంట్రోలర్ శ్రీరాం వెంకటేష్, కో ఆర్డినేటర్స్ శివ రామకృష్ణ పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ప్రొ. కుమార్, హెడ్ ప్రొ. రాజేంద్ర పాల్గొన్నారు.