Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అడిక్మెట్
గత 40 ఏండ్లుగా బీసీల కోసం అలుపెరగని పోరాటాలు చేస్తున్న బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్యపై సోషల్ మీడియాలో కొందరు చేస్తున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని బీసీ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ టైగర్ చంటి ముదిరాజ్ అన్నారు. ఈమేరకు సోమవారం విద్యానగర్ బీసీ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీల కోసం కుటుంబాన్ని, వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసిన కృష్ణయ్య లాంటి నాయకుడు దేశంలో లేడని అన్నారు. తన సొంత ఆస్తిని 25 ఎకరాలు బీసీ సంఘానికి కేటాయించిన గొప్ప నేత అని అన్నారు. ఆయన పోరాటాల ఫలితంగానే బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు, సంక్షేమ పథకాలు, బీసీ విద్యార్థులకు గురుకులాలు, రెసిడెన్షియల్ కళాశాలలు తదితర ఫలాలు అందుతున్నాయని తెలిపారు. బీసీలను, అఖిలపక్షాన్ని ఏకం చేయడంలో కృష్ణయ్య పోరాటాలు ఎనలేనివన్నారు. సమావేశంలో నీలా వెంకటేష్, ఉద్యోగుల సంఘం సంయుక్త కార్యదర్శి మారం శ్రీనివాస్, జగదీష్, రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు.