Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్చరల్
బాలసుబ్రహ్మణ్యం పాట నిత్య నూతనమని, ఎన్నిసార్లు విన్న ఆయన స్వరంలో మధురిమ విసుగు కల్గించదని ప్రఖ్యాత సాహితీవేత్త ఆచార్య కొలకలూరి ఇనాక్ అన్నారు. శ్రీత్యాగరాయ గానసభలో సోమవారం విజయ కృష్ణ సాంస్కృతిక సంస్థ నిర్వహణలో బాలు పాటకు స్వరాభిక్షేకం పేరిట గాయనీ గాయకులు పవన్, గొర్తి చంద్రశేఖర్, శివకుమర్, సతీష్, సుజాత, లక్గ్మి గాయత్రి మధుర గీతాలను ఆలపించారు. ముఖ్య అతిథిగా ఆచార్య ఇనాక్ పాల్గొని గాయకులను అభినందించారు.