Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బడంగ్పేట్
సీసీ రోడ్డు నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని మున్సిపల్ కమిషనర్ డాక్టర్ జి.ప్రవీణ్ కుమార్ అన్నారు. సోమవారం మహేశ్వరం నియోజకవర్గం జల్పల్లి మున్సిపల్ శ్రీరామ్ కాలనీలో రూ.50 లక్షలతో చేపడుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను 18వ వార్డు కౌన్సిలర్ కె. లక్ష్మీనారాయణతో కలిసి పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సీసీ రోడ్డు నిర్మాణ పనుల్లో నాణ్యత లోపిస్తే చర్యలు తప్పవని కాంట్రాక్టర్లను హెచ్చరించారు. రోడ్డు మధ్యలో ఉన్న కల్వర్టు నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయాలని కౌన్సిలర్ లక్ష్మీనారాయణ కోరడంతో మంత్రి సబితా ఇంద్రారెడ్డితో మాట్లాడి రూ.2లక్షల నిధులు మంజూరు చేయించారని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ ఆర్మీమెన్, సోషల్ మీడియా ఇన్చార్జి వాసుబాబు, మున్సిపల్ సూపర్వైజర్ కుమార్, కాలనీవాసులు పాల్గొన్నారు.