Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సరూర్నగర్
డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం అందరూ కలిసి రావాలి అని సరూర్నగర్ డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ అధికారి రవీందర్ రావు అన్నారు. ఈమేరకు సోమవారం మెడికల్ షాప్ , డిస్ట్రిబ్యూటర్లతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ప్రతి మెడికల్ షాప్ షెడ్యూల్ హెచ్1లో క్యాటగిరి చేయబడిన మందులను ఎలాంటి ప్రిస్క్రిప్షన్ లేనిదే ఇవ్వరాదని, నిబంధనలలో పేర్కొనబడిన మోతాదులో మాత్రమే మందులను ఇవ్వాలన్నారు. రూల్స్ అతిక్రమించిన దుకాణాదారులపై ఎన్డీపీఎస్ యాక్ట్ అనుగుణంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యువత పెడదోవ పట్టకుండా పోలీస్, ఎక్సైజ్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈకార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రం చేయడానికి తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. రంగారెడ్డి జిల్లా కెమిస్ట్స్, డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డా.పెండెం కృష్ణ కుమార్ మాట్లాడుతూ కెమిస్ట్లు సామాజిక బాధ్యతతో నార్కోటిక్ డ్రగ్స్ వాలిడ్ మందుల చీటి లేనిది విక్రయాలు చేయవద్దని, తగు జాగ్రత్తలు, సూచనలు పాటించాలని కోరారు. కార్యక్రమంలో డ్రగ్ ఇన్స్పెక్టర్ శైలజ, కె శ్రీనివాస్ రావ్, ఇన్స్పెక్టర్లు సీతారాం, రవి కుమార్, సరూర్ నగర్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ జి. శ్రీనివాస్ రావు, ఎస్ఐలు గాయత్రి, శుట్టరి, సిబ్బంది పాల్గొన్నారు.