Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు పబ్బతి శ్రీకృష్ణ
నవతెలంగాణ-హిమాయత్‌నగర్
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రూపొందించిన భారత రాజ్యాంగాన్ని సర్వ నాశనం చేయడమే బీజేపీ లక్ష్యంగా పెట్టుకుందని మాలమహానాడు జాతీయ అధ్యక్షులు పబ్బతి శ్రీకృష్ణ విమర్శించారు. సోమవారం హిమాయత్‌నగర్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2004లో సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్ ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగానికి వ్యతిరేకమని, ఎస్సీల్లోని అంతరాలకు వ్యవస్థ కారణమని చాలా స్పష్టంగా తీర్పునిచ్చిందని గుర్తు చేశారు. అయినప్పటికీ కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, ఇతర సహాయ మంత్రులు మురుగన్, నారాయణస్వామిలు వర్గీకరణ సాధ్యం అని చెప్పడం చూస్తుంటే కచ్చితంగా భారత రాజ్యాంగాన్ని సర్వ నాశనం చేసేందుకే చూస్తున్నారని ఆరోపించారు. 2014, 2019లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వంద శాతం అన్ని ప్రభుత్వరంగ వ్యవస్థలను అంబానీ, అదానీలకు, గుజరాత్ వ్యాపారులకు గంపగుత్తగా అమ్మేస్తున్నారని ఆరోపించారు. ఎస్సీలు తెలుగు రాష్ట్రాలలో రాజ్యాధికారానికి దూరం కావడం వర్గీకరణ చిచ్చు ప్రధాన కారణమన్నారు. ఇప్పుడిప్పుడే ఎస్సీలు విద్యాపరంగా ఎదుగుతూ ఆర్థిక, రాజకీయంగా ముందుకు వస్తున్న సమయంలో కక్షగట్టి విద్య, ఉద్యోగాలకు దూరం చేసేందుకు అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తున్న బీజేపీ మంత్రులకు ఎస్సీల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపీని ఓడించాలని సూచించారు.