Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుండిగల్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అన్ని డివిజన్లలో నీటి సమస్య అధికంగా ఉందని, దీంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సీపీఐ(ఎం) బాచుపల్లి మండల కార్యదర్శి బి వెంకటరామయ్య పేర్కొన్నారు. ఈమేరకు సోమవారం సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో హెచ్ఎండబ్ల్యుఎస్ ఏజీఎం ఆఫీసర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఐదు రోజులకు ఒకసారి తాగునీరు వస్తోందని, ప్రజలు నీటి సమస్యతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ముఖ్యంగా ప్రగతినగర్ 9 డివిజన్లలో నీటి సమస్య అధికంగా ఉందని, కొత్త మోటార్లు కొనుగోలు చేసి నీటి సరఫరా మెరుగుపరచాలని డిమాండ్ చేశారు. పలుచోట్ల నీటి లీకేజీలు అధికంగా ఉన్నాయని, వాటిని మరమ్మతులు చేయలేకపోవడంతో రోడ్డు వెంట నీరు వథాగా పోతుందని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు నీటి సమస్యను పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) బాచుపల్లి మండల కమిటీ సభ్యులు ఎం చంద్రశేఖర్, బాలపిర్, కాళ్ల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.