Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్.సుధా భాస్కర్
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
ప్రజలను విస్మరిస్తూ, వ్యతిరేక విధానాలను అవలంభించే ఏ పార్టీ మనుగడ సాధించలేదని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఆర్.సుధా భాస్కర్ అన్నారు. సోమవారం సీపీఐ(ఎం) కుత్బుల్లాపూర్ మండల 2వ మహాసభలు షాపూర్‌నగర్‌లోని ఎంవీ భాస్కర్‌రావు భవనంలో జరిగాయి. సుధా భాస్కర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం దేశ, రాష్ట్ర ప్రజలను మోసం చేస్తోందన్నారు. దేశంలో ప్రజావ్యతిరేక శక్తులు కొన్ని కమ్యూనిస్టులపై దాడులు చేస్తున్నాయని, వారి ఆటలు సాగవని అన్నారు. దేశంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రజలను భ్రమల్లో ఉంచుతూ తమ పబ్బం గడుపుకుంటున్నాయని చెప్పారు. స్థానిక సమస్యలపై ఉద్యమాలు చేపట్టాలని సూచించారు. అనేక పరిశ్రమలు మూతపడుతున్నాయని, ప్రజలకు కనీస అవసరాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి పి.సత్యం, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కోమటి రవి, ఆర్.వరప్రసాద్, మండల కార్యదర్శి కీలుకాని లక్ష్మణ్, ఐద్వా నాయకులు ఆర్.లక్ష్మి, ఆర్.స్వాతి, సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు జి. వెంకన్న, నాయకులు ఎండి సలీం, కె.బీరప్ప, దేవదానం, జి.అశోక్, ఎస్.కె.బురాన్, సత్యం, నర్సింహులు, అశోక్, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.
మండల కార్యదర్శిగా కీలుకాని లక్ష్మణ్
మహాసభలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. మండల కార్యదర్శిగా కీలుకాని లక్ష్మణ్ ఎన్నికయ్యారు. సభ్యులుగా లక్ష్మి, సలీం, సత్యం, బీరప్ప, బురాన్, అశోక్, శంకర్, పి.అంజయ్యలను ఎన్నుకున్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి నూతన కమిటీ నిరంతరం పని చేయాలని ముఖ్య అతిథిగా హాజరైన ఆర్.సుధా భాస్కర్ సూచించారు.