Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
కుల, మత, లింగ బేధాలకు అతీతంగా సమాజంలోని అన్ని వర్గాలకు సమాన హక్కులను కల్పించేందుకు తమ పార్టీ పాటు పడుతుందని ఇండియన్ బిలీవర్స్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు హ్యారీ సెబాస్టియన్ తెలిపారు. సామాజిక న్యాయం, సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా తమ పార్టీని ఏర్పాటు చేసినట్టు స్పష్టం చేశారు. సోమవారం శంషాబాద్‌లోని రితేష్ గ్రాండ్ హోటల్లో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమాలోచన సదస్సులో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సంజరు ఆనంద్, జాతీయ ఉపాధ్యక్షులు జోసఫ్‌తో కలిసి మాట్లాడారు. 75 ఏండ్ల స్వతంత్ర భారతదేశంలో క్రైస్తవులందరూ కాంగ్రెస్ జెండా మోసిన ఎలాంటి ప్రాధాన్యతకు నోచుకోలేదన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ బాబాసాహెబ్ అంబేద్కర్ క్రైస్తవులకు కల్పించిన హక్కులను కాల రాస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. క్రైస్తవుల హక్కులను సాధించుకునేందుకు ఇండియన్ బిలీవర్స్ పార్టీ పాటు పడుతుందని తెలిపారు. షెడ్యూల్డ్ తెగలు, దళితులు, మైనారిటీలు సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన అన్ని తరగతుల వారికి ప్రయోజనమే లక్ష్యంగా తమ పార్టీ పని చేస్తుందని పేర్కొన్నారు. నిరుద్యోలకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టనున్నట్టు తెలిపారు. గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసి రాబోయే అన్ని ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించారు.