Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
ప్రతిష్టాత్మక నిమ్స్ ఆస్పత్రిలో నాన్ ఫ్యాకల్టీ ఎంప్లాయీస్ యూనియన్ నూతన కార్యవర్గాన్ని సోమ వారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. యూనియన్ అధ్యక్షు లుగా నిమ్స్ సీనియర్ ఉద్యోగి సత్యగౌడ్, ప్రధాన కార్యాద ర్శిగా ఎస్ఆర్.సురేష్‌బాబును ఎన్నుకున్నారు. నిమ్స్ ఆస్పత్రిలో పని చేసే నాన్ ఫ్యాకల్టీ ఉద్యోగుల సంక్షేమం, వారి సమస్యల పరిష్కారం కోసం తాము కృషి చేస్తామని నూతన అధ్యక్షులు సత్యగౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని పలువురు అభినందించారు. యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎ.రాంబాబు, ఉపాధ్యక్షులుగా షాహీన, శ్రీధర్, సిరాజోద్దీన్, వీఅర్.దేవి, కార్యదర్శులుగా కనక తార, సుధాకర్, వేణుగోపాల్, కోశాధికారిగా వై.ఆశ, రాణిలను ఎన్నుకున్నారు.