Authorization
Sun April 13, 2025 08:45:32 pm
నవతెలంగాణ-కాప్రా
డాక్టర్ ఏఎస్ రావు నగర్ డివిజన్ వార్డు కార్యాల యంలో సోమవారం వివిధ శాఖల అధికారులతో కలిసి డివిజన్ కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష సోమశేఖర్‌రెడ్డి అధ్యక్షతన డివిజన్ పరిధిలో నెలకొన్న వివిధ సమస్యలు, జరగాల్సిన అభివృద్ధి పనుల గురించి డివిజన్ పరిధిలోని అన్ని కాలనీలు, అపార్ట్మెంట్ల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వివిధ కాలనీల ప్రతినిధులు ముఖ్యంగా తాము ఎదుర్కొంటున్న అండర్ గ్రౌండ్ డ్రయినేజీ, లో ప్రెజర్ నీటి సరఫరా, వీధి దీపాలు మెయింటెనెన్స్, దోమల, లో ఓల్టేజ్ సమస్య, పార్కుల అభివృద్ధి, ఇటీవల కురిసిన వర్షాలకు శిథిలమైన రోడ్లు వాటి మరమ్మతులు తదితర పనులు పూర్తి చేయాలని కార్పొరేటర్‌కు వినతి పత్రాలులు అందజేశారు. ముఖ్యంగా జై జవాన్ కాలనీ కి ఆనుకుని స్మశాన వాటిక అభివృద్ధి, పరిరక్షణకు చర్యలు చేపట్టాలని కాలనీవాసులు వినతి పత్రం ద్వారా కోరారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ డివిజన్ పరిధిలో నెలకొన్న ప్రతి సమస్యనూ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి దశల వారీగా పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. ఇప్పటికే కొన్ని అభివృద్ధి పనులు మంజూర య్యాయని తెలిపారు. త్వరలో అన్ని సమస్యలను పరిష్క రించేందుకు అధికారులతో కలిసి ప్రణాళికలు రూపొంది స్తున్నారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ అసెంబ్లీ నియోజక వర్గ బీ బ్లాక్ కాప్రా సర్కిల్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి, డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు, భవానీనగర్ కాలనీ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు కొత్త అంజిరెడ్డి, పెద్ది నాగరాజు గుప్తా, సీనియర్ నాయకులు ఎస్ ఏ రహీం, జీహెచ్ఎంసీ కాప్రా అధికారు లు డీఈ బాలకృష్ణన్, ఏఈ సంతోష్ రెడ్డి, ఏఈ ట్రాన్స్పోర్ట్ గంగా ప్రసాద్, డీఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ చందన, ఏఈ వాటర్‌వర్క్స్ స్రవంతి, ఏఈ ఎలక్ట్రికల్ ప్ర త్యూష, ఏఈ టీఎస్పీడీసీఎల్ మోహన్‌రెడ్డి, శానిటరీ సూ పర్వైజర్ నాగరాజు, జవాన్లు, వర్క్ ఇన్స్పెక్టర్లు ఎస్ఎఫ్ ఎలు, కాలనీల ప్రతినిధులు నవీన్‌గౌడ్ శ్రీనివాస్ సుదర్శన్‌రెడ్డి, జగన్ అల్లూరయ్య, తిరుమలయ్య, నాగు పాల్గొన్నారు.