Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి
- అలియబాద్ చౌరస్తాలో టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం
నవతెలంగాణ-శామీర్‌పేట
రాష్ట్రంలో ప్రజామోదం కలిగిన ఏకైక పార్టీ టీఆర్ఎస్ అని కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ నియోజకవర్గం టీఆర్ఎస్ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం శామీర్‌పేట మండలం అలియాబాద్ చౌరస్తాలో బుధవారం జరిగింది. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నవంబర్ 15న వరంగల్‌లో జరగబోయే టీఆర్ఎస్ మహాగర్జన సభకు అత్యధిక సంఖ్యలో ప్రజలను తరలించేలా కార్యకర్తలు, స్థానిక నాయకత్వం కృషి చేయాలని కోరారు. 75 లక్షలు పైచిలకు సభ్యులు కలిగిన అతిపెద్ద పార్టీ టీఆర్ఎస్ అని, కార్యకర్తలకు, ప్రజలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి వారి సంక్షేమానికి నిరంతరం పాటుపడుతున్నామని చెప్పారు. దేశంలోని ఏ రాష్ట్రంలో చేపట్టని సంక్షేమ, అభివృద్ధి పథకాలు తెలంగాణలో అమలుచేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మెన్ శరత్ చంద్రారెడ్డి, వైస్ చైర్మెన్ వెంకటేష్, టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మలిపెద్ది సుధీర్ రెడ్డి, కార్యదర్శి జహంగీర్, మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్చార్జి మర్రి రాజశేఖర్ రెడ్డి, అసెంబ్లీ ఇన్చార్జి మహేందర్ రెడ్డి, మున్సిపల్ చైర్మెన్ కారంగుల రాజేశ్వర్ రావు, వైస్ చైర్మెన్, డీసీఎంఎస్ వైస్ చైర్మెన్ మధుకర్ రెడ్డి, జడ్పీటీసీలు, ఎంపీపీలు తదితరులు పాల్గొన్నారు.