Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
నీట్ పరీక్ష రద్దు చేయాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో బుధవారం ఓయూ ఆర్ట్స్ కళాశాల ఎదుట నిరసన వ్యక్తంచేశారు. ఈసందర్భంగా ఓయూ ఎస్ఎఫ్ఐ కార్యదర్శి రవి నాయక్ మాట్లాడుతూ నీట్ పరీక్షలో ఓబీసీ కోటా 27 శాతం, ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్లపై స్పష్టత ఇవ్వకుండా కౌన్సిలింగ్ నిర్వహించకూడదన్నారు. రాష్ట్రాల హక్కులను హరించే విధంగా ఉన్న నీట్ పరీక్షను రద్దు చేయాలని, నీట్ పరీక్షల్లో జరుగుతున్న పేపర్ లీకేజీని నియంత్రించాలని కోరారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర నాయకులు అరవింద్, నాయకులు అఖిల్, లక్ష్మణ్, మురళి, రవీందర్, సతీష్, హరీష్, ప్రవీణ్ పాల్గొన్నారు.