Authorization
Sun April 13, 2025 03:48:59 am
- బీఎస్పీ రాష్ట్ర సమన్వయకర్త డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
నవతెలంగాణ-బడంగ్పేట్
రాష్ట్రంలోలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర సమన్వయకర్త డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం మిర్యాలగూడ పట్టణంలో నిరుద్యోగ సంఘీభావ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. రాష్ట్రంలోని వివిధ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఖాళీగా ఉన్న లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. గత ఎన్నికల్లో నిరుద్యోగులకు కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. నిరుద్యోగులపై ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంకుశ వైఖరిని వీడాలని కోరారు. ప్రభుత్వం సకాలంలో ఉద్యోగాలు భర్తీ చేయకపోవడంతో 54 మంది ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు మరణించారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చిత్తుచిత్తుగా ఓడించాలని నిరుద్యోగులకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో బీఎస్పీ అధికారంలోకి వస్తే ప్రయివేటు రంగంలోనూ రిజర్వేషన్లు ప్రవేశపెడతామని అన్నారు. నిరుద్యోగులు ఎవరు ఆత్మహత్యలకు పాల్పడకూడదని బహుజన రాజ్యంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు ప్రతి ఏటా క్యాలెండర్ ప్రకటించి ఉద్యోగాలు భర్తీ చేస్తామని పేర్కొన్నారు. తదనంతరం పలు పార్టీలకు చెందిన కార్యకర్తలు బీఎస్పీలో చేరారు. కార్యక్రమంలో మహేశ్వరం నియోజక వర్గం ఇన్చార్జి గుడ్ల శ్రీనివాస్ పాల్గొన్నారు.