Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్చరల్
మనిషి మేధస్సు, మనస్సు ఆలోచనలతో ముడిపడి ఉంటాయని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మెన్ జస్టిస్ చంద్రయ్య అన్నారు. శ్రీత్యాగరాయ గానసభలో ఏ. వీ.కె ఫౌండేషన్ నిర్వహణలో గురువారం అరిగపూడి విజయకుమార్ జన్మదిన వేడుకకు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. విజయకుమార్ మేధస్సుకు మంచి మనస్సు తోడు అవటం వల్ల ఆలోచనలు విశాల భావాలతో ఉన్నాయన్నారు. సంఖ్యాశాస్త్రవేత డైవజ్ఞ శర్మ అధ్యక్షత, నిర్వాహకులు రామకష్ణ నల్ల గిరి, శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రఖ్యాత బుర్ర కథ కళాకారుడు నాజర్ కుమారుడు బాబ్జీ బందం విజయకుమార్ జీవిత చరిత్రను బుర్రకథగా గానం చేశారు