Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సుల్తాన్‌బజార్
విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలని శ్రీ త్యాగరాజ ప్రభుత్వ సంగీత, నత్య కళాశాల ప్రిన్సిపాల్ రాఘవ రాజ్ అన్నారు. గురువారం రామ్ కోఠిలోని తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నడుపబడే శ్రీ త్యాగరాజ ప్రభుత్వ సంగీత, నత్య కళాశాలలో విద్యార్థులకు డిప్లమా కోర్స్‌లు కర్ణాటక గాత్రం, కర్ణాటక వయోలిన్, మదంగం, కూచిపూడి నృత్యం, భరతనాట్యం, పేరిణి నత్యం, హిందుస్థానీ గాత్రం, తబలా, వేణువు, డోలు, కథక్ నత్యంలో శిక్షణ ఇస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ రాఘవ రాజ్ తెలిపారు. మొత్తం కళాశాలలో 1500 మంది విద్యార్థులు శిక్షణ పొందుతున్నట్లు తెలిపారు. ప్రతిరోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి 7 గంటల వరకు క్లాసులు ఉంటాయని తెలిపారు.