Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
ఉస్మానియా యూనివర్సిటీ అర్థశాస్త్ర విభాగంలో తెలంగాణ ఉద్యమకారుడు మల్లేబోయిన అంజి యాదవ్ డాక్టరేట్ అందుకున్నాడు. బుధవారం స్నాతకోత్సవం సందర్భంగా గవర్నర్ తమిళిసై, డీఆర్డీఓ చైర్మెన్ డాక్టర్ సతీష్ రెడ్డి, ఓయూ వీసీ డి.రవీందర్ చేతుల మీదుగా ఆయన డాక్టరేట్‌ను స్వీకరించారు. ఓయూ అర్థశాస్త్ర విభాగంలో ప్రొఫెసర్ నరసింహరావు పర్యవేక్షణలో 'స్వయం సహాయక సేవా సంఘాలు' అనే అంశంపై పరిశోధన పూర్తి చేశారు. కాగా అంజి యాదవ్ సూర్యాపేట జిల్లా జిల్లా, అనంతగిరి మండలం గ్రామానికి చెందిన నిరుపేద యాదవ్ కుటుంబంలో పుట్టి ఏ స్థాయికి చేరుకున్నారు. ఓయూలో పీజీ చదివే సమయం నుంచి మలిదశ తెలంగాణ, ఉద్యమంలో కీలక పాత్ర పోషించాడు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం తెలంగాణ బీసీ సంఘం స్థాపించి బడుగు, బలహీన వర్గాల రాజ్యాధికారం కోసం పోరాటం చేస్తూ, లాక్డౌన్ సమయంలో కోదాడ నియోజకవర్గ పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసి తన మానవత్వాన్ని ప్రదర్శించారు. ఈసందర్భంగా అధ్యాపకులు, పరిశోధక విద్యార్థులు, ఉద్యమకారులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.