Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్
నవతెలంగాణ-ఓయూ
సికింద్రాబాద్ నియోజకవర్గాన్ని టీఆర్ఎస్కు కుంచుకోటగా మార్చామని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం గురువారం సీతాఫల్మండీలో జరిగింది. ఈసమావేశానికి అధ్యక్షత వహించిన డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ మాట్లాడుతూ సికింద్రాబాద్ నియోజకవర్గం ఐదు మున్సిపల్ డివిజన్లను గెలుచుకొని రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిచిందన్నారు. నవంబర్ 15న వరంగల్లో జరిగే విజయగర్జన సభకు సికింద్రాబాద్ నుంచి దాదాపు 25వేల మందిని తరలిస్తామని చెప్పారు. సమావేశంలో కార్పొరేటర్లు సామల హేమ, కంది శైలజ, లింగాని ప్రసన్న లక్ష్మీ శ్రీనివాస్, రాసురి సునీత రమేష్, టీఆర్ఎస్ యువ నేతలు తీగుల్ల కిషోర్ కుమార్ గౌడ్, రామేశ్వర్ గౌడ్, నాయకులు కంది నారాయణ, కరాటే రాజు, శ్రీనివాస్, సమన్వయకర్తలు జలంధర్ రెడ్డి, రాజ సుందర్ తదితరులు పాల్గొన్నారు.