Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) కీసర మండల నూతన కమిటీని గురువారం నాగారం మున్సిపాలిటీలో ఎన్నుకున్నారు. ఈకార్యక్రమానికి ఐద్వా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం వినోద, ప్రజానాట్యమండలి జిల్లా ప్రధాన కార్యదర్శి కొండూరి భాస్కర్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం దేశంలో జరుగుతున్న దాడులు, ఇండ్లు సమస్యలపై ఐద్వా నిరంతరం ప్రశ్నిస్తోందన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని, వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉందన్నారు. విపరీతంగా పెరుగుతున్న ధరలు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ రేట్లను అదుపుచేయడంలో కేంద్రప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. అర్హులందరికీ డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం కీసర మండల నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్ష కార్యదర్శులుగా పండుగ కవిత, పాండవుల రజిత, సభ్యులుగా అమరావతి, పద్మ, శిరీష, శ్రీవాణి, రేణుక, స్వప్న, ఎ. కవిత, బి. బాలమణి, సీహెచ్ మల్లమ్మ ఎన్నికయ్యారు.