Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఎల్బీనగర్
ఎల్బీ నగర్ జోనల్ కమిషనర్‌గా జీహెచ్ ఎంసీ ప్రధాన కార్యాలయంలో పనిచే స్తున్న పంకజ గురువారం ఎల్బీనగర్ జోనల్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆమె గతంలో ఎల్బీనగర్ డిప్యూటీ కమిషనరుగా పనిచేశారు. అప్పట్లో అధికారుల్లో, ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక్కడ జోనల్ కమిషనర్‌గా పనిచేస్తున్న ఉపేందర్‌రెడ్డి నల్గొండ మునిసిపల్ కమిషనర్‌గా బదిలీపై వెళ్లారు. ప్రస్తుతం బాధత్యలు చేపట్టిన జోనల్ కమిషనర్ కమిషనర్ పంకజ ఇక్కడి ప్రజా సమస్యలపై అవగాహన కలిగి ఉన్నారు. ఆమె ఎల్బీనగర్ జోనల్ కమిషనర్‌గా తిరిగి రావడం పట్ల అధికారులు, ఎల్బీనగర్ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాలనీలో పారిశుధ్య పనుల రోజు వారీ పర్యవేక్షణ, అక్రమ నిర్మాణాలను నిరోధించడం, అభివద్ధి పనులను వేగవంతం చేయడం కోసం అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు ఆమె తెలిపారు. ఎల్బీనగర్, సరూర్‌నగర్, హయత్‌నగర్, ఉప్పల్, కాప్రా సర్కిల్స్ అధికారులు వచ్చి జోనల్ కమిషనర్ పంకజను కలిసి అభినందనలు తెలియజేశారు.