Authorization
Sun April 06, 2025 11:08:36 am
- అడిషనల్ కలెక్టర్ నర్సింహ్మరెడ్డి
నవతెలంగాణ-ఘట్‌కేసర్‌రూరల్
పోచారం మున్సిపాలిటీ పరిధి నారపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, అన్నోజిగూడ ఎస్టీ కమ్యూనిటీ భవనంలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని రెవెన్యూ విభాగం అడిషనల్ కలెక్టర్ నర్సింహ్మరెడ్డి గురువారం అకస్మిక తనిఖీ చేశారు. మున్సిపాలిటీలో వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్‌లో చేపట్టిన కార్యక్రమాల గురించి స్థానిక కమిషనర్ సురేష్‌ను అడిగి తెలుసుకున్నారు. మున్సిపాలిటీలో అందరి సహకారంతో 95 శాతం వ్యాక్సినేషన్ వేసినట్లు, దాదాపు 6 వేల మంది వ్యాక్సిన్ వేయించుకోలేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి ప్రవీణ్, మున్సిపాలిటీ మేనేజర్ నర్సింలు, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.