Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉద్యమకారులకు సముచిత స్థానం ఇవ్వాలి
- మహేశ్వరం నియోజక వర్గం నుంచి భారీగా తరలి వెళ్ళాలి
- వరంగల్‌లో జరిగే విజయ గర్జన విజయవంతం కావాలి
- మంత్రి సబితా ఇంద్రారెడ్డి
నవతెలంగాణ-బడంగ్పేట్
రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల కోసం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలతోనే ప్రజల్లో మంచి ఆదరణ పెరిగిందని, టీఆర్ఎస్ ఆవిర్భవించి 20 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నవంబర్ 15న వరంగల్‌లో ఏర్పాటు చేస్తున్న విజయగర్జన సభను విజయవంతం చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, మహేశ్వరం నియోజక వర్గం నుండి భారీ ఎత్తున ప్రజలు తరలి వచ్చి విజయ గర్జన సభను విజయవంతం చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బడంగ్పేట్ కార్పొరేషన్ పరిధిలోని పెద్దబావి మల్లారెడ్డి ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మహేశ్వరం నియోజకవర్గ విస్తత స్థాయి కార్యకర్తల సమావేశం బడంగ్పేట్ కార్పొరేషన్ పార్టీ అధ్యక్షులు రామిడి రాంరెడ్డి అద్యక్షతన సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఇంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ అని, ఆ పార్టీకి మనమందరం మద్దతు తెలపాలని, అవకాశవాద రాజకీయ పార్టీలకు బుద్ధి చెప్పాలన్నారు. కేంద్ర ప్రభుత్వం గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలను పెంచి సామాన్య ప్రజలకు ఇబ్బందులు కల్గిస్తున్న బీజేపీకి హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఓటర్లు, ముఖ్యంగా మహిళలు ఓటుతో బుద్ధి చెప్పాలని, టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అన్ని ప్రభుత్వరంగ సంస్థలను అమ్ముకుంటూపోతూ, లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులను రోడ్డున పడవేస్తున్న బీజేపీకి ఉప ఎన్నికల్లో పరాభవం తప్పదన్నారు. అమ్మకానికి మారు పేరు అయిన బీజేపీకి తగిన బుద్ధి చెప్తూ, నమ్మకానికి మారు పేరు అయిన తెలంగాణ రాష్ట్ర సమితికి పట్టం కట్టలన్నారు. నవంబర్ 15న ప్రతి గ్రామంలో, ప్రతి డివిజన్లో పార్టీ జెండా ఎగురవేసి, మండల కేంద్రానికి, కార్పొరేషన్లలో ముఖ్య కేంద్రాలకు చేరుకోవాలని పిలుపు ఇచ్చారు. ఆ రోజు సూర్యపేట్లో ఉదయం 11 గంటల వరకు భ్రమరాంబ ఫంక్షన్ హాల్‌కు చేరుకొని భోజనం చేసి, అక్కడ నుండి సభకు బయలు దేరాలన్నారు. ప్రతి ఒక్కరు తెలంగాణ ఉద్యమకారులను గౌరవించాలని, తనకంటే ముందు వారిని వేదికపై పిలవాలని కోరారు. సమావేశానికి ముందు సభా ప్రాంగణంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్పర్సన్ తీగల అనితరెడ్డి, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మెన్ ఆయాచితం శ్రీధర్, మాజీ ఎమ్మెల్యే తీగల కష్ణారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ పాండు రంగారెడ్డి, మేయర్లు చిగురింత పారిజాత నర్సింహ్మారెడ్డి, దుర్గాదీప్‌లాల్ చౌహన్, యువనేత పి.కౌశిక్ రెడ్డి, డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్‌రెడ్డి, ఎంపీపీ, జడ్పీటీసీలు, మార్కెట్ చైర్పర్సన్ వరలక్ష్మి, సహకార సొసైటీ చైర్మెన్లు, కార్పొరేషన్ల పార్టీ అధ్యక్షులు రాంరెడ్డి, కామేష్‌రెడ్డి, డివిజన్ల అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు, పార్టీ సీనియర్ నేతలు జిల్లెల కష్ణారెడ్డి, బేర బాలకిషన్, యువజన విభాగం అధ్యక్షులు కొండల్ రెడ్డి, తెలంగాణ ఉద్యమకారులు, వివిధ అనుబంధ సంఘాల అధ్యక్షులు, కార్యవర్గాలు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, వార్డు సభ్యులు, సొసైటీ డైరెక్టర్లు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.