Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బ్యాంక్ లింకేజి ద్వారా రూ. 98.15 కోట్లు పంపిణీ
- యూసీడీ ఆధ్వర్యంలో వినూత్న కార్యక్రమాలు
నవతెలంగాణ-సిటీబ్యూరో
నగరంలో నివసించే నిరుపేదల బతుకులు మార్చేందుకు జీహెచ్ఎంసీ చర్యలు ప్రారంభించింది. వ్యాపార, వ్యాపారేతర నిర్వహణకోసం స్వయంసహాయక సంఘాలకు అవసరమైన పెట్టుబడి కోసం సూక్ష్మరుణాలను అందించి కుటుంబ ఆర్థిక వ్యవస్థ మెరుగుకు కావాల్సినపెట్టుబడి అందించి, ఆర్థికంగా ఎదిగేలా ప్రోత్సహించాలనేది ప్రభుత్వ లక్ష్యం.
రూ.98.15కోట్ల రుణాలు
జీహెచ్ఎంసీ ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు బ్యాంక్ లింకేజి ద్వారా రూ.98.15కోట్లను 1735 స్వయం సహాయక సంఘాల మహిళలకు అందించారు. 2014-15 ఆర్థిక సంవత్సరం నుంచి ప్రస్తుత సంవత్సర కాలంలో ఇప్పటి వరకు మొత్తం రూ.2269.37 కోట్లను బ్యాంక్ లింకేజ్ ద్వారా 68,894 మంది మహిళలకు అందజేశారు. 42,165 స్వయం సహాయక గ్రూప్లను ఏర్పాటు చేయగా, ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు మరో 219 గ్రూప్లను ఏర్పాటు చేశారు. దీంతో మొత్తం 4,21,650 మంది సభ్యులున్నారు.
'వికాసం' : నిరుపేద వికలాంగులను ఆదుకునేందుకు వికాసం అనే ప్రత్యేక కార్యక్రమం కొనసాగుతున్నది. దీని ద్వారా వికలాంగ మహిళలకు ఆర్థిక చేయూతనిస్తారు. ప్రస్తుతం మొత్తం 887 స్వయం సహాయక సంఘాల పనిచేస్తుండగా వారికి రూ.13.23 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు రూ.75.50లక్షల ఆర్థిక సహాయాన్ని 39 పీడబ్ల్యూడీ స్వయం సహాయక సంఘాలకు రుణాలు అందిం చారు. ఆర్థిక స్వావలంబన కోసం స్వయం సహాయక సంఘాలకు సూక్ష్మ రుణాలు అందించడమేగాక స్వయం ఉపాధి కోసం రుణాలు ఇచ్చేందుకు కషిచేస్తున్నారు. వివిధ స్వయం ఉపాధి పథకాల ద్వారా లబ్ధిదారులకు ఆర్థిక సహాయం అందించే నేపథ్యంలో ఈ ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ.5కోట్ల 48 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని 957 మందికి అందించాల నేది ప్రభుత్వ లక్ష్యం. పథకం టార్గెట్ సాధించేందుకు దరఖాస్తు లను ఆహ్వనిస్తున్నారు. ఇప్పటి వరకు 71మంది దరఖాస్తు చేసు కోగా అందులో 20 మందికి సుమారు 8లక్షల రూపాయలపైగా సహాయం అందించారు. ఈ ఆర్థిక సంవత్సరం చివరి వరకు మిగితా లక్ష్యాన్ని పూర్తి చేయనున్నారు.