Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్‌పేట
అంబర్‌పేట డివిజన్ అహ్మద్ నగర్లో రూ.47 లక్షల అంచనా వ్యయంతో నూతన సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభిస్తున్నట్లు అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ తెలిపారు. ఈమేరకు కార్పొరేటర్ ఇ.విజరు కుమార్ గౌడ్‌తో కలిసి సీసీ రోడ్డు పనుల శంకుస్థాపన చేశారు. అనంతరం పాదయాత్ర నిర్వహించి ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో కాంట్రాక్టర్లు రవీందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, టీఆర్ఎస్ డివిజన్ ప్రెసిడెంట్ సిద్ధార్థ్ ముదిరాజ్, పార్టీ నాయకులు లవంగం ఆంజనేయులు, రామారావు యాదవ్, మల్లేష్ యాదవ్, సతీష్, సలీం, ప్రవీణ్, ధర్మ, సతీష్‌గౌడ్, లత, గౌస్, నాగరాజు, దీపు, సాయి మరియు బస్తీ వాసులు దావూద్, మోహ్సిన్, బాబా, నిజాం, మున్నా, సోహెల్, సులేమాన్, ఆజాం పాల్గొన్నారు.