Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హోంమంత్రి మహమూద్ అలీ
నవతెలంగాణ-సుల్తాన్‌బజార్
టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు అందరూ నవంబర్ 15వ తేదీన వరంగల్‌లో నిర్వహించనున్న విజయ గర్జన సభకు తరలిరావాలని హోం శాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. నాంపల్లి నియోజకవర్గం ఇన్చార్జ్ సీహెచ్ ఆనంద్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో రెడ్ హిల్స్ హనుమాన్ వ్యాయామ పాఠశాలలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమం కోసం కషి చేస్తున్నారన్నారు. ప్రజలందరూ విజయ గర్జన సభకు రావాలని సూచించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి రమేష్. ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్ రావు, నియోజకవర్గ ఇన్చార్జ్ సీహెచ్ ఆనంద్ కుమార్ గౌడ్, సాయి కిరణ్ యాదవ్, లక్ష్మీనారాయణ, ప్రదీప్ కుమార్ అగర్వాల్, అశ్విన్, అభిషేక్, మెట్టు వాల్మీకి, బాసిత్, అబ్దుల్ కలీం, సంజరు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.