Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కంటోన్మెంట్
కంటోన్మెంట్ బోర్డు రెండో వార్డు పరిధిలోని అర్జున్నగర్ నాలుగో లైన్లో సమస్యలు తెలుసుకునేందుకు గురువారం వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మెన్ టీఎం శ్రీనివాస్ స్థానిక నాయకులతో కలిసి పర్యటించారు. మురికి కాల్వల సమస్య పరిష్కారం కోసం బోర్డు అధికారులతో సంప్రదించి వెంటనే శానిటరీ సిబ్బందిని పిలిపించి మరమ్మతులు చేయించారు. అలాగే స్థానికులు తెలిపిన పలు సమస్యలను ఎమ్మెల్యే దష్టికి తీసుకుపోయారు. ఇతర సమస్యలు కూడా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మాజీ డైరెక్టర్ దేవులపల్లి శ్రీనివాస్, వార్డు టీఆర్ఎస్ అధ్యక్షుడు కుమార్ ముదిరాజ్, నరసింహ, రాకేష్, లక్ష్మణ్, సాయమ్మ తదితరులు పాల్గొన్నారు.