Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాప్రా
చాలాకాలంగా పెండింగ్లో ఉన్న అన్నపూర్ణ కాలనీ ప్రధాన రోడ్డు పనులు సత్వరమే ప్రారంభించాలని నాచారం డివిజన్ కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్ అధికారులకు సూచించారు. ఈమేరకు గురువారం అన్నపూర్ణ కాలనీలో పాదయాత్ర నిర్వహించి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వర్షాలకు అన్నపూర్ణ కాలనీ కమ్యూనిటీ హాల్ ఎదుట వర్షపు నీరు నిలిచి ఉంటుందని, సిల్క్ చాంబర్ వరకు పైప్లైన్ వేసి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో డీఈ రూప, ఏఈ రాకేష్, వర్క్ ఇన్స్పెక్టర్ విజరు కుమార్, కాంట్రాక్టర్ రవీంద్ర సాగర్, నాచారం డివిజన్ బీసీ సెల్ అధ్యక్షులు విఠల్ యాదవ్, సాయిజెన్ శేఖర్, పరమేష్ తదితరులు పాల్గొన్నారు.