Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాప్రా
మల్లాపూర్ వార్డు కార్యాలయంలో శానిటేషన్ అధికారులు, సిబ్బందితో కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఇంటింటికి చెత్త వేసే కార్యక్రమంపై సమీక్షలో దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ శానిటేషన్ సిబ్బంది ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా చెప్పి వారిని ఒప్పించే బాధ్యత తీసుకోవాలని కోరారు. ప్రజలు రోడ్లపై చెత్తను వేయకుండా చెత్త బండిని ఉపయోగించుకోవాల్సిందిగా కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. వారం పాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో డలీఈ చందన, శానిటేషన్ ఇన్స్పెక్టర్ నాగరాజు, ట్రాన్స్పోర్ట్ ఏఈ గంగాప్రసాద్, జవ్వాన్ యాదగిరి, ఎస్ఎఫ్ఏలు పాల్గొన్నారు