Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
ప్రజలందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని హబ్సిగూడా కార్పొరేటర్ కక్కిరేణి చేతన హరీష్, రామంతపూర్ కార్పొరేటర్ బండారు శ్రీవాణి వెంకట్రావు కోరారు. ఈమేరకు శుక్రవారం హబ్సిగూడా డివిజన్ కామాక్షిపురం స్ట్రీట్ నెంబర్ 9 అంగన్ వాడీ సెంటర్లో జరుగుతున్న ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను పరిశీలించారు. డాక్టర్ రవీనా, ఏఎన్ఎం అనిత, కామాక్షిపురం కాలనీ ప్రెసిడెంట్ రవి, బీజేపీ రామంతపూర్ ప్రధాన కార్యదర్శి నారాయణ్ దాస్, వెంకటేష్ గుప్తా, హబ్సిగూడ డివిజన్ ఓబీసీ ప్రధాన కార్యదర్శి ముషిగంపల శివగౌడ్, లింగం పాల్గొన్నారు.