Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
జీవన శైలి మార్పులతో బ్రెయిన్ స్ట్రోక్‌ను నివారించవచ్చు అని రెనోవా హాస్పిటల్ కన్సల్టెంట్ న్యూరాలజిస్టు డా. ఎన్ చక్రధర్‌రెడ్డి సూచించాంచారు. వరల్డ్ స్ట్రోక్ డే సందర్భంగా శుక్రవారం సనత్‌నగర్ రెనోవా హాస్పిటల్ ఆధ్వర్యంలో స్ట్రోక్ లేదా (పోటు)అనబడే ఆరోగ్య సంబంధిత సమస్యపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాధికి లక్షణాలు చాలా తక్కువగా కనిపిస్తాయన్నారు. నూతనంగా వచ్చిన టెక్నాలజీ సహకారంతో ఈ వ్యాధిని 30 శాతం మేర నివారించగలుగుతున్నామన్నారు. ఈ వ్యాధి లక్షణాలు వయసుతో పని లేకుండా ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వహించే వారికి, ముఖ్యంగా మద్యం, ధూమపానం, గుట్కా ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్ జంక్ ఫుడ్ తీసుకోవడం వంటివి చేసేవారికి తొందరగా సోకే అవకాశం ఉందన్నారు. ప్రజల్లో ఈ వ్యాధిపై అవగాహన లేకపోవడం స్ట్రోక్ అనగానే మనకు గుర్తుకు వచ్చేది గుండె పోటు లేదా మెదడుకు వచ్చే స్ట్రోక్‌లు మాత్రమేనని ఆయన తెలిపారు. స్ట్రోక్ అనేది మెదడులో గాని లేదా గుండెలో గాని రక్త నాళాలు పాడై రక్త సరఫరా ఆగిపోవడం వల్ల సంభవించే ఆరోగ్య సమస్య అంటారని వివరించారు. స్ట్రోక్ వచ్చిన వెంటనే చికిత్స అందించగలిగితే రోగికి ప్రాణాపాయం నుంచి తప్పించవచ్చని పేర్కొన్నారు.