Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బోడుప్పల్
ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పనలో బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ ముందంజలో ఉందని మేయర్ సామల బుచ్చిరెడ్డి అన్నారు. శుక్రవారం కార్పొరేషన్ పరిధిలోని 20, 25 డివిజన్లలో రూ.44 లక్షల నిధులతో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మౌలిక సదుపాయాల కల్పన కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో బోడుప్పల్ డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మి రవి గౌడ్, కార్పొరేటర్లు జె.పద్మా రాములు, జడిగే మహేందర్ యాదవ్, బొమ్మకు సుగుణ, గుర్రాల రమా, కొత్త శ్రీవిద్య, దోంతరబోయిన మహేశ్వరి, డీఈ కుర్మయ్య, టీఆర్ఎస్ నాయకులు దానగళ్ల యాదగిరి, జె.రాములు, కొత్త రవిగౌడ్, బందారపు శ్రీధర్ గౌడ్, తోటకూర శ్రీశైలం యాదవ్ పాల్గొన్నారు.