Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేర్ ఆస్పత్రి వైద్యులు
నవతెలంగాణ-గాంధీనగర్
ముషీరాబాద్ కేర్ ఆస్పత్రిలో అక్టోబర్ 16 వ తేదీన పార్సీగుట్టకు చెందిన శిల్ప డెలివరీ కోసం చేరింది. పాపకు జన్మించిన తర్వాత శిశువు కండిషన్ బాగా లేదని రూ.34 లక్షలు డిమాండ్ చేశారని ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు. నీలోఫర్ హాస్పిటల్కు తీసుకెళ్లగా రెండు రోజుల తర్వాత పాప మరణించింది. తల్లి కండిషన్ సరిగా లేనందున ముషీరాబాద్ కేర్ ఆస్పత్రి నుంచి బంజారా హిల్స్ కేర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అప్పటికే రూ.22 లక్షలు కట్టిన కుటుంబ సభ్యులకు మరో రూ. 5 లక్షలు వెంటనే కట్టాలని హాస్పిటల్ యాజమాన్యం చెప్పడంతో శిల్ప బంధువులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళన విరమింపజేశారు. కాగా వైద్యం పూర్తి ఐన తర్వాతనే బిల్లు మాట్లాడదామని డాక్టర్లు చెప్పడంతో బంధువులు శాంతించారు.